Home / TELANGANA / రోడ్డు ఎక్కితే బండి సీజ్..కర్ఫ్యూ టైమింగ్స్ ఇవే!

రోడ్డు ఎక్కితే బండి సీజ్..కర్ఫ్యూ టైమింగ్స్ ఇవే!

లాక్‌డౌన్ అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. సాయంత్రం 7 గంటల తర్వాత ఎవరూ రోడ్లు ఎక్కొద్దని సూచించింది. వాహనాలు రోడ్డెక్కితే సీజ్ చేస్తామని సూచించింది.లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర సరిహద్దులను మూసివేశామని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తెలిపారు. అత్యవసరాలకు సంబంధించిన వాహనాలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నామన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఎక్కడా ఐదుగురు కంటే ఎక్కువగా గుమి కూడొద్దన్నారు. అత్యవసర విభాగాలు, ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న వారు మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావాలన్నారు. రోడ్ల మీదికి వాహనాలు ఎక్కడానికి అనుమతి లేదన్నారు. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఎవరూ బయటకు రావడానికి వీల్లేదన్నారు. బయటకు వచ్చిన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆటోలు, ఇతర వాహనాలు తిరగొద్దన్నారు. వ్యవసాయ సంబంధ పనులు ఆపితే ఇబ్బంది అవుతుంది కాబట్టి.. సంబంధిత పనులపై ఆంక్షలు విధించడం లేదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కూడా ఆపడం లేదన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దన్నారు. వారంతా కచ్చితంగా క్వారంటైన్‌లో ఉండాలని.. ఇంట్లో క్వారంటైన్లో ఉండకపోతే.. పాస్‌పోర్టుపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మెడికల్ ఎమర్జెన్సీ ఉంటేనే బయటకు వెళ్లడానికి అనుమతి ఇస్తామన్నారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌కు మద్దతు ఇవ్వాలన్నారు. అనంతరం డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనాను కట్టడి చేయడం కోసమే లాక్‌డౌన్ ప్రకటించామన్నారు. ప్రజల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కానీ నేటి ఉదయం నుంచి బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, ప్రయివేట్ వాహనాలు తిరగడానికి అనుమతి లేదన్నారు. ప్రయివేట్ వాహనాల ద్వారా దూర ప్రయాణం చేయడానికి అనుమతి లేదని.. మెడికల్ ఎమర్జెన్సీకే పర్మిషన్ ఉందన్నారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడానికి పోలీసు శాఖ కృషి చేస్తోందన్నారు. ఈ వారం రోజులు ఇళ్లకే పరిమితమైతే.. సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. లేదంటే అది మరిన్ని రోజులు కొనసాగే ప్రమాదం ఉందన్నారు. మానవాళి మనుగడ కోసం ప్రపంచమంతా లాక్‌డౌన్‌ విధానాన్ని అనుసరిస్తున్నారన్న డీజీపీ.. దీన్ని సరిగా పాటించకపోతే సమస్య తీవ్రం అవుతుందన్నారు. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవర్నీ రోడ్ల మీదకు అనుమతించబోమన్నారు. బంకులు, కూరగాయల షాపులు కూడా రాత్రి ఏడు గంటలకే మూసేస్తారన్నారు. మిగతా సమయంలో అత్యవసరాల కోసమే బయటకు వెళ్లాలన్నారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలు అందాయన్నారు.

దేశంలో 415కు చేరిన కరోనా కేసుల సంఖ్య .చెక్ పోస్టులను ఏర్పాటు చేసి.. రోడ్ల మీద తిరుగుతున్న వారిని పోలీసులు తనిఖీ చేస్తారని డీజీపీ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా చెక్ పోస్టుల వద్ద కనిపిస్తే.. వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత వాహనాలను యజమానులకు అప్పగిస్తామన్నారు. బైక్ మీద ఒకరు, ఫోర్ వీలర్ మీద ఇద్దరు వెళ్లడానికి మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. పదే పదే నిబంధనలను అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. రోడ్ల మీద వాహనాలను నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు సొంతూళ్లకు వెళ్లడానికి కూడా అనుమతి ఇవ్వబోమన్నారు…

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat