Home / NATIONAL / దేశంలో కొత్తగా 45 వేల కరోనా కేసులు

దేశంలో కొత్తగా 45 వేల కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న 46 వేల కేసులు నమోదవగా, నిన్నటికంటే 2.12 శాతం తక్కువగా 45 వేల పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 91 లక్షలకు చేరువయ్యాయి.

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 45,209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 90,95,807కు చేరాయి. ఇందులో 4,40,962 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 85,21,617 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 501 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా మృతులు 1,33,227 మంది మృతిచెందారు.

నిన్నటివరకు మొత్తం 13,17,33,134 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. ఇందులో నవంబర్‌ 21న 10,75,326 నమూనాలను పరీక్షించామని తెలిపింది.