Home / SLIDER / హుజురాబాద్ లో చేతులెత్తేసిన కాంగ్రెస్ .. అందుకేనా..?

హుజురాబాద్ లో చేతులెత్తేసిన కాంగ్రెస్ .. అందుకేనా..?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాఫిక్ హుజురాబాద్ బైపోల్.. అక్టోబర్ ముప్పై తారీఖున హుజురాబాద్ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల తరపున టీఆర్ఎస్ పార్టీ తరపున బీసీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు.. ఉద్యమ కారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు,సీఎం కేసీఆర్ ఇప్పటికే ఖరారు చేయడమే కాకుండా బీ ఫారం కూడా అందించారు. మరోవైపు బీజేపీ అభ్యర్థిని ప్రకటించకపోయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగడం ఖాయమైనట్లే తెలుస్తుంది.

అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి కొండ సురేఖను బరిలోకి దించాలని టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి భావించి కోండ దంపతులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కొండ సురేఖ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగాలంటే కొన్ని కండీషన్లు పెట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత జోరును పరిశీలిస్తే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం కాబట్టి తాను ఓడిన గెలిచిన కానీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ జిల్లాలో మూడు స్థానాలను తమకు ఇవ్వాలని కోండ దంపతులు టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జ్ మాణిక్ ఠాగూర్ ముందు డిమాండ్లను పెట్టారు .

అయితే కొండ దంపతులు పెట్టిన డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకరించకపోవడంతో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగడానికి కొండ సురేఖ నో చెప్పడంతో ఆ పార్టీ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. టీఆర్ఎస్ ,బీజేపీ పార్టీలు బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను నిలబెట్టడంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలను జల్లెడ పట్టే పనిలో ఉంది కాంగ్రెస్ . అయితే ఈటలతో అనుముల రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు . అందుకే కొండ సురేఖ దంపతులు పెట్టిన డిమాండ్లను అంగీకరించడం లేదు. రెడ్డి సామాజిక వర్గం అని మాటలు చెబుతూ చివరికి ఒక డమ్మీ అభ్యర్థిని రేవంత్ రెడ్డి నిలబెట్టి పరోక్షంగా ఈటల రాజేందర్ కు సాయం చేస్తాడని ఆ పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నారు. చూడాలి మరి రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో..?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat