ఫ్రాన్స్ లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఒకేరోజు ఏకంగా లక్ష కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,04,611 మంది వైరస్ బారిన పడినట్లు ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ వెల్లడించింది.
కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఒకే రోజు నమోదైన అత్యధిక కేసులు ఇవే. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి కూడా ఎక్కువగా ఉందని ఫ్రాన్స్ వైద్యశాఖ ప్రకటించింది. రానున్న రోజుల్లో ఒమిక్రాన్ కేసులు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.