తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
గడిచిన 24 గంటల్లో 1,015 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,56,344 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఓవైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.