ప్రపంచవ్యాప్తంగా గత వారం 1.8 కోట్ల కరోనా కేసులు నమోదైనట్లు WHO తెలిపింది. అంతకుముందు వారంతో పోల్చితే కేసులు 20 శాతం పెరిగినట్లు వెల్లడించింది. మరణాల సంఖ్య స్థిరంగా 45 వేలుగా ఉన్నట్లు పేర్కొంది. ఆఫ్రికా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో కరోనా కేసులు పెరిగినట్లు పేర్కొంది. ఒమిక్రాన్ వ్యాప్తి తగ్గుతోందని, కేసులు కూడా తగ్గుతాయని అభిప్రాయపడింది.
