తెలంగాణలో గ్రామాల్లో కరోనా పంజా విసురుతోంది. రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ తోపాటు మరో 14 జిల్లాల్లో వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, హనుమకొండ, సంగారెడ్డి, ఖమ్మం, మంచిర్యాల, కరీంనగర్, భద్రాద్రి, పెద్దపల్లి, మహబూబ్నగర్, సిద్దిపేట, నిజామాబాద్, యాదాద్రి, వికారాబాద్ జిల్లాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాకపోకలు యథేచ్ఛగా కొనసాగడం, పండగలు, శుభకార్యాలు, రాజకీయ కార్యక్రమాలే వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయి.
