ఏపీలోని టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తిరుమల తిరుపతిలో ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్స్ పై నిషేధం విధించినట్లు TTD ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
‘తిరుమలలో విద్యుత్ వాహనాల వినియోగం ప్రారంభించాం. త్వరలో RTC ద్వారా 100 విద్యుత్ బస్సులు నడుపుతాం. భవిష్యత్తులో తిరుమలకు విద్యుత్ వాహనాలను మాత్రమే అనుమతించాలనే ఆలోచన చేస్తున్నాం. శ్రీవారి ప్రసాదాలను ప్లాస్టిక్ బ్యాగుల్లో కాకుండా.. జూట్, పర్యా వరణహితమైన సంచుల్లో ఇస్తున్నాం’ అని తెలిపారు.