Home / CRIME / మ‌త్తు క‌లిపిన డ్రింక్‌ ఇచ్చి అత్యాచారం

మ‌త్తు క‌లిపిన డ్రింక్‌ ఇచ్చి అత్యాచారం

యూపీలోని ఘ‌జియాబాద్‌ జిల్లా మోదీనగర్ పట్టణంలో 19 ఏళ్ల యువ‌తిపై గ్యాంగ్ రేప్ జ‌రిగింది. బ‌ర్త్‌డే పార్టీకి వెళ్లిన యువ‌తిని ముగ్గురు యువ‌కులు రేప్ చేశారు. ప్రైవేటు కంపెనీలో ప‌నిచేస్తున్న అమ్మాయి.. ఆదివారం ఆ పార్టీకి వెళ్లింది. అక్క‌డ ఆమెకు మ‌త్తు క‌లిపిన డ్రింక్‌ను ఇచ్చారు. ఓ వ్య‌క్తి ఆ అమ్మాయిని రూమ్‌లోకి తీసుకువెళ్లి ఫ్రెండ్స్‌ను పిలిచాడు. ఆ త‌ర్వాత వాళ్లు రేప్‌కు పాల్ప‌డి ఉంటార‌ని పోలీసులు చెప్పారు.

కొంత సేప‌టికి మ‌త్తు నుంచి తేరుకున్న ఆ అమ్మాయి వారిని ప్ర‌తిఘ‌టించింది. అయితే ఆ స‌మ‌యంలో ఆ యువ‌తిని ఆ ముగ్గురు యువ‌కులు బెదిరించారు. విష‌యాన్ని ఎవ‌రికైనా చెబితే చంపేస్తామ‌ని హెచ్చ‌రించారు. అక్క‌డ నుంచి ఆ ముగ్గురు యువ‌కులు పారిపోయిన‌ట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ యువ‌తి ఇంటికి వెళ్లి త‌న ఫ్యామిలీకి జ‌రిగిన విష‌యాన్ని చెప్పింది. తండ్రితో క‌లిసి ఆ యువ‌తి మోదీన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది.

ఆ యువ‌తికి వైద్య ప‌రీక్షలు నిర్వ‌హించి గ్యాంగ్ రేప్ జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. నిందితుల్ని శేఖ‌ర్‌, కృష్ణ‌, అర్జున్‌గా గుర్తించారు. వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లు ఏఎస్పీ ఇరాజ్ రాజా తెలిపారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri