తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఆసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరిన సంగతి విదితమే. దీంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి.
ఈ క్రమంలోనే ఉప ఎన్నికలకు ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ ప్రజకలే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకు షాకిచ్చారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటు గురించి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ అవును కేంద్రంలోని మోదీ సర్కారు వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితే తప్పేంటి? అంటూ మునుగోడు ఉప ఎన్నికకు ముందే ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చారు.
అయినా నష్టాల్లో ఉన్న డిస్కంలను కాపాడు కొనేందుకు మీటర్లు పెడితే తప్పేంటి.మా పార్టీ మీటర్లు పెట్టినా వ్యవసాయానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉచితంగానే కరెంటును ఇస్తుంది కదా?’ అంటూ అతితెలివిని ప్రదర్శించారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా తన నూతన క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.