Home / SLIDER / సీఎం కేసీఆర్ ఉచ్చులో బీజేపీ

సీఎం కేసీఆర్ ఉచ్చులో బీజేపీ

డామిట్…కథ అడ్డం తిరిగింది! ఎనిమిది రాష్ట్రాల్లో దిగ్విజయంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వాల కుత్తుకలు కోస్తూ విజయగర్వంతో మీసాలు మెలేస్తూ వస్తున్న బీజేపీకి తెలంగాణాలో కేసీఆర్ శ్మశ్రుతిరుక్షవరం గావించి పేడిమూతితో సమాజం ముందు నిలబెట్టారు! తమ విశృంఖలత్వానికి మొయినాబాద్ ముకుతాడు వేస్తుందని ఏమాత్రం ఊహించని బీజేపీ అధినాయకత్వం ఒక్కసారిగా చేష్టలుడిగిపోయింది. ఏమి చెప్పాలో తెలియక యాదాద్రి, వేదాద్రి అంటూ డ్రామాలు ఆడుతూ గంగవెర్రులెత్తిపోతున్నది. యాదాద్రి ప్రమాణాలను రాజ్యాంగం, చట్టం అంగీకరించవు. కేసీఆర్ మోసం చేశాడనుకుంటే నిక్షేపంగా న్యాయస్థానం గడప తొక్కడం ఒక్కటే మార్గం. ఆ రాచమార్గాన్ని వదిలేసి తడిబట్టలు కట్టుకుని గుళ్ళు గోపురాలకు రమ్మనడం, సవాళ్లు చేయడం చూస్తుంటే బీజేపీ నాయకులకు మతి చలించినట్లే తోస్తున్నది.

తెలిసీతెలిసి కేసీఆర్ తో గోక్కోవడం అంటే కణకణమండే అగ్నిహోత్రంలో కంఠాన్ని పెట్టడమే. విద్యుత్ ప్లగ్ లో వేలుదోపి స్విచ్ వెయ్యడమే. ఇప్పటికి ఎన్నోసార్లు రుజువైంది. కేసీఆర్ రాజకీయవ్యూహాలను పసిగట్టడం ఫాలాక్షుడికి కూడా సాధ్యం కాదని ఏడేళ్ళక్రితమే రేవంత్ రెడ్డి, చంద్రబాబుల విషయంలో స్పష్టమైంది. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం అంటూ తొడగొట్టిన చంద్రబాబు టీఆరెస్ ఎమ్మెల్యేను కొనాలని ప్రయత్నించి ఎసిబి వారికి పట్టుబడి అసలు తెలంగాణ నుంచే పారిపోవాల్సిన అగత్యం ఏర్పడింది. ఈనాటికీ కేసీఆర్ కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటానికి కూడా చంద్రబాబుతో సహా తెలుగుదేశం నాయకులు వణికిపోతున్నారు. ఏ అంశంలోనూ కేసీఆర్ ను తప్పుపట్టడానికి తెలుగుదేశం నాయకులు కానివ్వండి, ఈనాడు రామోజీరావు కానివ్వండి… గజగజమంటారు. రేవంత్ రెడ్డి టిడిపినే వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సివచ్చింది. కేసీఆర్ పంజా విసిరితే దాన్నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు.

సాధారణంగా కేసీఆర్ అనేక విషయాలను పట్టించుకోరు. అలాగే తనను ఎంతమంది విమర్శించినా ప్రతివిమర్శలు చెయ్యరు. ఎవ్వరికీ అపకారం చెయ్యరు. కానీ తెలంగాణ ఆత్మగౌరవం జోలికి ఎవరొచ్చినా సరే ప్రళయకాలరుద్రుడు అవుతారు. ఆ ధీరత్వమే ఆయన్ను తెలంగాణాలో తిరుగులేని నాయకుడుగా తయారుచేసింది. ఆ వచ్చేది చంద్రబాబు కావచ్చు..మోడీ కావచ్చు..అమిత్ షా కావచ్చు..తమిళిసై కావచ్చు…ఎవరినీ లెక్కచెయ్యని భాస్వర భాస్కరుడు ఆయన.

ఆయన ఎత్తులు కూడా ఎలా ఉంటాయంటే ఎదుటివాడి కడుపులో ఖడ్గం దిగేంతవరకూ అతడికి తెలియనివ్వడు. మొన్న మొయినాబాద్ ఫార్మ్ హౌస్ లో జరిగింది అదే. గత అయిదారునెలలుగా బీజేపీ నాయకులు రఘునందన్ రావు, సంజయ్, అరవింద్, నడ్డా, కిషన్ రెడ్డి, తరుణ్ ఛుగ్ లాంటి నాయకుల ప్రకటనలు చూడండి…టీఆరెస్ నుంచి పదిమంది టచ్ లో ఉన్నారు…నెలరోజుల్లో ప్రభుత్వం కూలుతుంది…ఫలానా నాయకుడు మా దగ్గరకు వస్తున్నాడు…లాంటి ప్రగల్భాలు ఎన్నెన్ని పలికారో పత్రికలు తిరగేస్తే అర్ధం అవుతుంది. ఆ ఉడుత ఊపులకు భయపడే రకమా కేసీఆర్? అప్పుడే కొందరు పార్టీ ఎమ్మెల్యేలమీద నిఘా మొదలైంది. బీజేపీ నాయకులు తమ ఎమ్మెల్యేలకు గాలం విసురుతున్నారని సమాచారం రూఢి అయిన తరువాత ఆపరేషన్ కు వ్యూహాన్ని రచించారు కేసీఆర్. ఆ పధకం ప్రకారమే ఎమ్మెల్యేలను బీజేపీ దొంగస్వాములు టచ్ లోకి రావడం, వాట్స్ అప్ మెసేజెస్ పంపడం, డబ్బును ఎరగా వెయ్యడం మొదలైన అన్ని విషయాలను సాక్ష్యాధారాలతో కేసీఆర్ ధ్రువపరచుకున్నారు.

మొన్న మూడు గంటలకు పోలీసులు మొయినాబాద్ వెళ్లి అక్కడ అరవై సిసి కెమెరాలను అమర్చారు. రేవంత్ రెడ్డిని పట్టుకోవడంలో ఎలాంటి వ్యూహం అమలు చేసారో అచ్చంగా అలాంటి వ్యూహమే ఇక్కడ కూడా అమలుచేశారు. అప్పుడు రేవంత్ రెడ్డి ఎలా రాగల విపత్తును ఎలా ఊహించలేకపోయారో, ఇక్కడ దొంగస్వాములు కూడా అలాగే ఊహించలేకపోయారు. బియ్యపు గింజలను మాత్రమే చూసి వాటిమీద బిగించిన వలను చూడలేక నింగిని ఎగురుతున్న కపోతాలసమూహం ఎలా వలలో చిక్కుకుపోయాయో, అదే విధంగా స్వాములు, బ్రోకర్ …. కేసీఆర్ పన్నిన ఉచ్చులో కంఠం దాకా బిగుసుకుపోయారు!

నిన్న వదిలిన ఆడియోలు కేవలం శాంపిల్ మాత్రమే. ఇంకా వీడియోలు ఉన్నాయంటున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు యాభై కోట్లు ఇస్తామని హామీ ఇచ్చిన వాయిస్ టేపుల్లో రికార్డ్ అయిందని పోలీసులు స్పష్టం చేశారు. అన్నీ బయటకు వస్తాయి. ఆ సంగతి తెలిసిన కేంద్ర నాయకులు చెప్పుకింది తేళ్లలా కిక్కురుమనడం లేదు. మునుగోడులో సభను కూడా రద్దు చేసుకున్నారట. బహుశా నాలుగైదు రోజుల్లో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి జాతీయమీడియా సమక్షంలో బీజేపీ దుమ్ము దులుపుతారని టీఆరెస్ నాయకులు నమ్ముతున్నారు.

మొత్తానికి ఈ నాటకం బయటపడటంతో మునుగోడులో బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా నేలకు కరుచుకునిపోయిందట. టీఆరెస్ అభ్యర్ధికి ముప్ఫయివేల ఓట్ల మెజార్టీ వస్తుందని ఆ పార్టీవారు అంచనాలు వేస్తున్నారు.

ఇక్కడ ఒక విషయం స్పష్టమైంది. రాష్ట్ర బీజేపీ నాయకులంతా డమ్మీలు..వేస్ట్ ఫెలోస్. అందుకే ఆపరేషన్ ఢిల్లీనుంచి మొదలుపెట్టారని ఒక దొంగస్వామి చెప్పాడు. సో ఢిల్లీ రాజకీయం ఏమిటో ఈ గల్లీ నాయకులకు తెలియదు. అందుకే యాదాద్రి, ప్రమాణాలు అంటూ రంకెలు వేస్తున్నారు!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat