తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవల టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ పెట్టిన సంగతి విదితమే. దీని గురించి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ కాదు.. అంతర్జాతీయ పార్టీ కూడా పెట్టుకోవచ్చంటూ వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీ రామారావు కౌంటరిచ్చారు. ‘బీఆర్ఎస్’ పార్టీపై రాహుల్ స్పందించిన తీరు హాస్యాస్పదం. అంతర్జాతీయ నేత రాహుల్ తన సొంత నియోజకవర్గం అమేథీలోనే గెలవలేకపోయారు. అలాంటి వ్యక్తి బీఆర్ఎస్ పై మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ప్రధాని కావాలి అనుకునేవారు ముందు ఎంపీ అయ్యేలా ప్రజల్లో నమ్మకం సంపాదించాలి” అని మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.