మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఈ రోజు గురువారం ఓ అరుదైన సంఘటన జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం మొదలైన ఈ పోలింగ్ లో భాగంగా బీజేపీ తరపున బరిలోకి దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ను తమకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని ఏకంగా పోలింగ్ బూత్ లోనే ఓటర్లు నిలదీయడం చర్చానీయంశమైంది.
ఈరోజు ఉదయం ఐదుగంటలకు డబ్బులు తమకు ఎందుకు పంచలేదని పోలింగ్ బూత్‌లో మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని శివన్న గూడెం గ్రామస్తులు అడ్డుకుని నిలదీశారు. డబ్బులు పట్టుకుంటున్నారు కాబట్టే పంచలేకపోయానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సమాధానం చెప్పారు.