తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు,కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. నిన్న ఆదివారం విడుదలైన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ తరపున బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పదివేల మూడు వందల తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేసిన సంగతి విదితమే.
అయితే ఈ ఉప ఎన్నికల ఫలితాల గురించి బండి సంజయ్ మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో నైతిక విజయం మాదే. అధికార టీఆర్ఎస్ పార్టీ మద్యం,డబ్బులను పంచి గెలిచింది. నిజంగా తమపై తమకు అంత పూర్తి నమ్మకం ఉంటే కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లో చేరిన పన్నెండు మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో గెలవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది.. తండ్రి సీఎం కేసీఆర్ దా.. లేదా కొడుకు మంత్రి కేటీఆర్ దా అని ఆయన ప్రశ్నించాడు.