ఏపీ అధికార వైసీపీ అధినేత .. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పై ఉన్న నమ్మకంతోనే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని మంత్రి ఆర్కే రోజా తెలిపారు.
వైజాగ్ కేంద్రంగా జరుగుతున్న సమ్మిట్ లో వచ్చిన ఈ ప్రతిపాదనలన్నీ 100% అమల్లోకి వస్తాయని అన్నారు ఆర్కే రోజా. పర్యాటక రంగంలో రూ.22వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ కు ఒప్పందాలు జరిగాయని చెప్పారు.
తిరుపతి, గండికోట, పిచ్చుకలంక, విశాఖలో ఒబెరాయ్ సంస్థ ఫైవ్ స్టార్ హోటల్స్ ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.