Home / SLIDER / వైరల్ అవుతున్న మంత్రి కేటీఆర్ ట్వీట్

వైరల్ అవుతున్న మంత్రి కేటీఆర్ ట్వీట్

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప‌రుష ప‌దాల‌తో ట్వీట్ చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నార‌ని బీఆర్ఎస్  వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్  ట్వీట్ చేశారు. తెలంగాణ‌  లో మాత్రం ఏకంగా ముఖ్య‌మంత్రి, మంత్రుల‌ను అస‌భ్య‌మైన ప‌ద‌జాలంతో దుర్భాష‌లాడుతూ.. అవ‌మాన‌క‌రంగా మాట్లాడుతున్నా స‌హిస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా క‌న్న‌డ న‌టుడు చేతన్‌ ను అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్‌కు త‌ర‌లించిన విష‌యాన్ని కేటీఆర్ ప్ర‌స్తావించారు. తెలంగాణ‌లోనూ అదే త‌ర‌హాలో స‌మాధానం ఇవ్వాలేమోన‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

దీనిపై మీరేమంటారు..? అని ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కేటీఆర్ ప్ర‌శ్నించారు. భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌.. దూషించే స్వేచ్ఛ కాకూడ‌ద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino