జాతిపిత మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకనీ (89) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం ముంబయిలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఉషా గోకనీ గత ఐదేండ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. రెండేండ్లుగా మంచానికే పరిమితమయ్యారు. ముంబయిలోని గాంధీ స్మారక నిధి కి గతంలో ఆమె చైర్ పర్సన్‌గా పని చేశారు. గాంధీ స్థాపించిన వార్ధా సేవాగ్రామ్ ఆశ్రమం లో గోకనీ బాల్యం గడిచింది.
