Home / SLIDER / 35వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ‘ప్రగతి యాత్ర‘

35వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ‘ప్రగతి యాత్ర‘

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 35వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా నందానగర్, గాంధీనగర్, వెంకట్ రామ్ రెడ్డి నగర్ లలో స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. నందానగర్ లో రూ.2.90 కోట్లతో సీసీ రోడ్లు, ఎస్సీ స్మశానవాటిక, బస్తీ దవాఖాన వంటి అభివృద్ధి పనులు పూర్తి చేసినందుకు ఎమ్మెల్యే గారికి బస్తీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. మిగిలి ఉన్న రోడ్లు, డ్రైనేజీ, బోర్ వాటర్ సమస్య, ఎస్సీ, మైనార్టీ, ముదిరాజ్ ల స్మశానవాటికల అభివృద్ధి, కరెంటు పోల్స్ బదిలీ వంటి సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు.

గాంధీనగర్ లో రూ.2.90 కోట్లతో భూగర్భడ్రైనేజీ, దాదాపు సీసీ రోడ్లు పూర్తి చేసినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు. హిందూ స్మశానవాటిక, ముస్లీం స్మశానవాటిక, మహిళా భవనం, కమ్యూనిటీ హాల్, బస్ షెల్టర్, మిగిలిన సిసి రోడ్ల పనులను వేగంగా చేపట్టి పూర్తి చేయాలని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. వెంకట్ రామ్ రెడ్డి నగర్ లో రూ.3 కోట్లతో సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ, కమ్యూనిటీ హాల్ వంటి అభివృద్ధి పనులు పూర్తి చేసినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు. కమిటీ హాల్ వద్ద గతంలో వర్షం కురిస్తే వరద నీటితో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళమని రోడ్డు పూర్తి చేయడంతో సమస్య పరిష్కారం అయ్యిందని హర్షం వ్యక్తం చేశారు. మిగిలి ఉన్న భూగర్భడ్రైనేజీ, కమిటీ హాల్ పై అంతస్తు, అంతర్గత సీసీ రోడ్లు, మహిళా భవనం పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారిని కోరారు.

ఈ మేరకు ఎమ్మెల్యే గారు స్పందిస్తూ అక్కడే ఉన్న సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాటిపై చర్యలు తీసుకొని వేగంగా శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయరాం, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏర్వ శంకరయ్య, మాజీ అధ్యక్షుడు గౌసుద్దిన్, ప్రధాన కార్యదర్శి సుధాకర్, డిఈఈ భాను చందర్, ఏఈ మల్లారెడ్డి, కాలనీల సంక్షేమ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు నందానగర్ ప్రెసిడెంట్ కార్తిక్ గౌడ్, నర్సింగ్ రావు, హరిబాబు, చిన్న నర్సింగ్ రావు, రాజేష్, వీరీశ్, దాసు, బాబుమియ, సుజాత, దుర్గమ్మ, సులోచన, చిత్ర, సుకన్య, శాంత కుమారి, గాంధీ నగర్ అధ్యక్షుడు జల్దా రాఘవులు, చింతయ్య, జల్దా లక్ష్మీనాథ్, అబ్దుల్ ఖాదర్, ఎల్లయ్య, నీలగిరి, వాజిద్, శ్రీనివాస్, సత్యనారాయణ, బిర్జు సింగ్, చిన్నయ్య,, రాజిరెడ్డి, వెంకట్ సాయి, పద్మ, మని, వెంకట్ రామ్ రెడ్డి నగర్ ప్రెసిడెంట్ సతీష్ గట్టోజి, రషీద్, లక్ష్మణ్ గౌడ్, మోహన్ రెడ్డి, మల్లేష్ చారి, అశోక్, రామకృష్ణ ముదిరాజ్, బసప్ప, రాజిరెడ్డి, మహదేవ్, సంతోష్ గౌడ్, నారాయణ, జయమ్మ, విజయ, మహబూబ్ బీ, స్వాతి, జ్యోతి మరియు నాయకులు ఓంకార్ రెడ్డి, క్రాంతి యాదవ్, మోహన్ లాల్, బాలు నేత, అల్లావుద్దీన్, మేరీ, ఈష్వరి, కిరణ్, సాయి, గౌస్, తేజ తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat