Site icon Dharuvu

ఉత్త‌రాఖండ్ బోర్డ‌ర్ వ‌ద్ద గ్రామాలను నిర్మిస్తోన్న చైనా

చైనా, ఇండియా స‌రిహ‌ద్దుల్లో ఇప్ప‌టికే ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఇక తాజాగా ఉత్త‌రాఖండ్ బోర్డ‌ర్ వ‌ద్ద పొరుగు దేశం చైనా గ్రామాల‌ ను నిర్మిస్తున్న‌ట్లు వెల్ల‌డైంది.

ఎల్ఏసీకి 11 కిలోమీట‌ర్ల దూరంలో 250 ఇండ్లు ఉన్న ఓ గ్రామాన్ని నిర్మించిన‌ట్లు తెలుస్తోంది. ఉత్త‌రాఖండ్‌కు సుమారు 35 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న మ‌రో ప్రాంతంలో కూడా చైనా దాదాపు 56 ఇండ్లు నిర్మిస్తున్న‌ట్లు కొన్ని వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. సుదీర్ఘ‌మైన స‌రిహ‌ద్దు వెంట సుమారు 400 గ్రామాల‌ను నిర్మించాల‌ని చైనా ప్లాన్ వేసింది.

Exit mobile version