Breaking News
Home / NATIONAL / కేంద్ర మంత్రి అమిత్ షాను కల్సిన మ‌హిళా రెజ్ల‌ర్లు

కేంద్ర మంత్రి అమిత్ షాను కల్సిన మ‌హిళా రెజ్ల‌ర్లు

రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడు ,బీజేపీ ఎంపీ,బ్రిజ్ భూష‌ణ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టాప్ మ‌హిళా రెజ్ల‌ర్లు ధ‌ర్నా  చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ రెజ్ల‌ర్లు శ‌నివారం అర్థ‌రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను క‌లిశారు. అయితే ఆ మీటింగ్ అసంపూర్ణంగా ముగిసిన‌ట్లు సాక్షీమాలిక్ భ‌ర్త స‌త్య‌వ్ర‌త్ ఖ‌దియాన్ తెలిపారు. కేంద్ర మంత్రి షా నుంచి స‌రైన రీతిలో స్పంద‌న రాలేద‌ని స‌త్య‌వ్ర‌త్ తెలిపారు.

శ‌నివారం రాత్రి 11 గంట‌ల‌కు అమిత్ షా నివాసంలో రెజ్ల‌ర్ల‌తో భేటీ జ‌రిగింది. లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూష‌ణ్‌ను అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు. భ‌జ‌రంగ్ పూనియా, సాక్షీ మాలిక్‌, సంగీతా పోగ‌ట్‌, స‌త్యవ్ర‌త్ ఖ‌దియాన్ మీటింగ్‌కు హాజ‌ర‌య్యారు. నిష్పాక్షికంగా విచార‌ణ జ‌ర‌గాల‌ని కోరారు. అయితే చ‌ట్ట ప్ర‌కార‌మే చ‌ర్య‌లు ఉంటాయ‌ని అమిత్ షా అన్నార‌ని తెలిసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino