తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అండగా నిలుస్తూ నిరుపేదల ఆరోగ్యానికి అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.
గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ గుండ్లసింగారం కి చెందిన దద్దునూరి రాధ గారు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకునేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి రావడంతో వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రత్యేక చొరవ తీసుకొని 2 లక్షల రూపాయల ఎల్ఓసీ ని మంజూరు చేయించి హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని ఎమ్మెల్యే గారి నివాసంలో లబ్ధిదారుకి ఎమ్మెల్యే గారు అందజేశారు.అనంతరం లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి,ఎమ్మెల్యే అరూరి రమేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో ఏనుమాముల మార్కెట్ డైరెక్టర్ గనిపాక విజయ్,1వ డివిజన్ ప్రెసిడెంట్ నరెడ్ల శ్రీధర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.