Home / HYDERBAAD / ఎస్టీపీలతో 100% మురుగునీటి శుద్ధీకరణ…

ఎస్టీపీలతో 100% మురుగునీటి శుద్ధీకరణ…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు ‘తెలంగాణ మంచినీళ్ళ పండుగ‘ను నిర్వహిస్తున్న నేపథ్యంలో చెరువులు కలుషితం కాకుండా వంద శాతం మురుగునీటిని శుద్దీకరించాలనే లక్ష్యంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.248 కోట్లతో చేపడుతున్న 5 ఎస్టీపీల నిర్మాణ పనుల్లో భాగంగా జీడిమెట్ల వెన్నెల గడ్డ వద్ద రూ.21.87 కోట్లతో 10 MLD సామర్ధ్యం గల ఎస్టీపీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అధికారులతో కలిసి పరిశీలించారు.

దాదాపు 70% పనులు పూర్తి కావడంతో మిగిలి ఉన్న పనులు అక్టోబర్ వరకు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే గారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీఎం (ఎస్టీపీ) తిప్పన్న, జీఎం శ్రీధర్ రెడ్డి, ప్రాజెక్ట్ ఇంఛార్జి శ్యామ్ మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat