తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్‌తోపాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో భేటీకానున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నారు.అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ సమాయత్తంపై చర్చించనున్నారు.
పీసీసీ పొలిటకల్ ఎఫైర్స్ కమిటీ తీర్మాన కాపీని ఖర్గేకు అందించనున్నారు. సాయంత్రానికి సీఎం తిరిగి హైదరాబాద్ రానున్నారు. కాగా, ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశం ఉన్నది పార్టీ వర్గాలు వెల్లడించారు.