ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు…మరోవైపు సమీపిస్తున్న మెట్రో ప్రారంభ గడువు…ఇంకోవైపు గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ పేరుతో దక్షిణాసియాలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వేదికగా సాగుతున్న సదస్సు…ముఖ్య అతిథులు అగ్రరాజ్యధిపతి డొనాల్డ్ ట్రంప్ తనయ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…అతిథులుగా…150 దేశాలకు చెందిన 1500 మంది అతిథులు…ఇంతటి మహత్కార్యాలను తన భుజనవేసుకొని…గ్రాండ్ సక్సెస్ చేసిన వ్యక్తి రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్. ఇటు ప్రభుత్వ అధికారులతో…కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో మరోవైపు అమెరికాకు చెందిన బాధ్యులతో..ఇంకోవైపు క్షేత్రస్థాయిలో సిబ్బంది 24*7 అన్నట్లుగా సమన్వయం చేసి విశ్వనగర ప్రయాణ అనుభూతిని మార్చే మెట్రో ప్రారంభాన్ని…అంతర్జాతీయ యవనికపై హైదరాబాద్ ఖ్యాతిని గర్వంగా చాటిన జీఈఎస్‌ను గ్రాండ్ సక్సెస్ చేశారు.
జీఈఎస్‌కు ప్రధానమంత్రి హాజరవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోను ఆయన చేతే ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్ సిద్ధమయ్యారు. ప్రతివారం సమీక్షా సమావేశం నిర్వహించి ఏర్పాట్లు సమీక్షించారు. దగ్గరుండి సెఫ్టీ సర్టిఫికేట్ వచ్చేలా చేశారు. దీని ఫలితంగానే పలు నగరాల్లో మెట్రో ప్రారంభించిన అనంతరం కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ హైదరాబాద్ మెట్రో విషయంలో అలాంటి ఇబ్బందులు ఏవీ ఎదురుకాలేదని అంటున్నారు. నిత్యం ప్రధానమంత్రి కార్యాలయం సమీక్షించిందని…అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెట్రో ప్రారంభోత్సవం సందర్భంగా స్వయంగా మంత్రి కేటీఆర్‌ను పిలిచి…ఆయన వచ్చిన తర్వాతనే రిబ్బన్ కత్తిరించారని పలువురు గుర్తు చేస్తున్నారు.
Post Views: 212