తెలంగాణ రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు నిన్న సిద్ధిపేట లో జరిగిన ఓ కార్యక్రమంలో సెల్ ఫోన్ వాడకం పై యువతకు ఒక మంచి సూచన చేసారు.. సెల్ ఫోన్ ను వీలైనంతగా తక్కువగా వాడటమే మంచిదని సూచించారు. సెల్ ఫోన్ నిత్య జీవితంలో ఒక భాగంగా మారిందని .. చాలా మంది దాన్ని విపరీతంగా వాడుతూ ఇబ్బందులు పాలవుతున్నారని ..తక్కువ గా వాడాలని మంత్రి హరీష్ సూచించారు . ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు విరివిగా ఫోన్ మాట్లాడితే శారీరకంగా త్వరగా అలసి పోతున్నామని.. మానసికంగా ఒత్తిడికి గురవుతున్నామని మంత్రి హరీశ్ అన్నారు . సెల్‌ఫోన్‌ను ఎక్కువసేపు వినియోగించడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందన్నారు. అవసరమైతే మెసేజ్‌లు, వాట్సాప్ మెసేజ్‌లు పంపించడం మంచిదని మంత్రి హరీశ్ సూచించారు.
