విజయ డెయిరీ కార్మికుల సమస్యలపై పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటర్కు రూ. 4 చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకం అందజేస్తుందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. కరీంనగర్ డెయిరీ, మదర్ డెయిరీ, ముల్కనూర్ డెయిరీలకు సంబంధించిన 2.17 లక్షల మంది రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ ప్రోత్సాహకాల కోసం ఏడాదికి రూ. 125 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని చెప్పారు.విజయ డెయిరీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. జనవరి రెండో వారంలో అధికారులతో కలిసి డెయిరీ సందర్శిస్తానని ఈ సందర్బంగా తెలిపారు.
