దళితుల జీవితాల్లో వెలుగులు నింపదమే కేసీఆర్ లక్ష్యమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. 1985లోనే మొట్టమొదట దళితజ్యోతిని ప్రారంరంబించింది ముఖ్యమంత్రి కేసీఆరే అని తెలిపారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన దళిత బిడ్డలని అన్నారు. సూర్యాపేటలో జరిగిన దళితుల సదస్సులో మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు యూరప్‌లో అత్యంత ఎతైన శిఖరాన్ని అధిరోహించింది నల్గొండ దళిత బిడ్డేనని ఆయన ఉద్ఘాటించారు.
ప్రతి గ్రామంలో అంబేడ్కర్ భవనాలు, అంబేడ్కర్ భవనాలలో వ్యాయమశాలలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. కార్పొరేట్ విద్యకు ధీటుగా ఎస్సీ గురుకులాలు వివరించారు. అయిదు లక్షల సబ్సిడీతో ఎస్సీ యువత ఉపాధికి 10 లక్షల రుణాలు ఇస్తున్నామన్నారు. శుభకార్యాలకు ఉపయోగపడేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి 20 లక్షలు ఇస్తున్నామన్నారు. దళితులకు మూడెకరాల భూపంపిణీ చేస్తున్నామన్నారు.
క్రీడలలో సూర్యాపేట జాతీయస్థాయికి ఎదగాలని మంత్రి జగదీశ్ రెడ్డి ఆకాంక్షించారు. క్రీడలు మానసికోల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయన్నారు. 1500 కోట్లతో సూర్యాపేట నియోజకవర్గ అభివృద్ధి అని అన్నారు. మీ ఆదరణ చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేమతో ఇచ్చిన కానుక మెడికల్ కళాశాల అని వెల్లడించారు.