తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జైలు మ్యూజియంలో కేరళ రాష్ర్టానికి చెందిన అంతర్జాతీయ బంగారం వ్యాపారి బాబీ చెమ్మనూర్ ఒక రోజు గడిపారు. రూ.500ఫీజు కట్టి మరీ తన కోరికను తీర్చుకున్నారు. తన ముగ్గురు మిత్రులు ఇంజినీర్ ఆసీన్‌అలీ, ట్రైనర్ ప్రశాంత్, దుబాయ్ జర్నలిస్టు బినయ్‌తో కలిసి జైలుకు వచ్చారు. రూ.2వేలు కట్టి, జైలులో ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా, ఖైదీల్లా ఉన్నారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ, తనకు 15ఏళ్లుగా జైలు జీవితం గడపాలనే కోరిక ఉండేదనీ, ఇక్కడి విషయాన్ని మీడియా కథనాలతో తెలుసుకొని వచ్చామని, తన చిరకాల వాంఛ తీరిందని ఆనందంగా చెప్పారు. కాగా, జైల్ మ్యూజియంకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతున్నదని, ఇప్పటి దాకా 49మంది జైలు జీవితం అనుభూతి పొందినట్లు సూపరింటెండెంట్ సంతోష్‌రాయ్ వెల్లడించారు.
see also : గల్ఫ్ కార్మికుల కోసం అవసరమైతే కువైట్ వెళ్తా.. మంత్రి కేటీఆర్
see also : కేసీఆర్ కిట్ భేష్..కేంద్ర వైద్యారోగ్యశాఖ అదనపు కార్యదర్శి ప్రశంస
see also :మినీ ట్యాంకు బండ్ పై మంత్రి హరీష్ మార్నింగ్ వాక్