గులాబీ దండు రాబోయే స్థానిక సంస్థల, సహకార, అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దం కావాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. హుజురాబాద్ మండలం సింగాపూర్లో గురువారం హుస్నాబాద్ నియొజకవర్గ టీఆరెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీనియర్ నాయకులు ZP వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, హుస్నాబాద్ నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, పన్యాల భూపతిరెడ్డి, కర్ర శ్రీహరి, పేర్యాల రవిందర్ రావు, డా.మరేపల్లి సుధీర్ కుమార్, సురేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మట్లాడుతూ టీ ఆర్ ఎస్ ప్రభుత్వం గత ఏ ప్రభుత్వాలు చెయని విధంగా అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. మిషన్ కాకతీయ, భగీరథ, పెన్షన్లు, కల్యాణళక్ష్మి, షాదీ ముబారక్, గొర్రెల పంపిణీ వంటి పథకాల్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు విభేదాలు పక్కనపెట్టి ఐక్యతతో పార్టీ అభివృద్దికి కృషి చేయాలని కోరారు. పార్టీకి కార్యకర్తలు, నాయకులే ముఖ్యమని, పార్టీకి వారే గుండె కాయ అని, వారి కస్టాల్లో తాను భాగస్వామిని అవుతానని ఆయన ఉద్వేగంగా అన్నారు. ఆత్మ విశ్వాసంతో, ధైర్యంతో నాయకులు ముందుకు పోవాలని సూచించారు.
పార్టీ ని బూతు స్థాయి నుండి బలోపేతం చేయాలని, పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఇస్తానని అన్నారు. ఫిబ్రవరి 15 నుండి పల్లెబాట కార్యక్రమం నిర్వహిస్తానని, పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిషరిస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఉదయం 11 గంటల నుంది సాయంత్రం 7 గంటల వరకు సుదీర్ఘంగా సమావేశం జరిగింది. పార్టీ పటిష్టతపై కార్యకర్తలు పలు సూచనలు చేసారు. ఈ సమావేశంలో TRS పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ చైర్మన్ లు, పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి ల కోఆర్డినేటర్ లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.