Home / TELANGANA / నల్గొండ ఉప ఎన్నికపై సీక్రెట్ సర్వే..టీ కాంగ్రెస్‌కు షాకింగ్ రిజల్ట్‌…!

నల్గొండ ఉప ఎన్నికపై సీక్రెట్ సర్వే..టీ కాంగ్రెస్‌కు షాకింగ్ రిజల్ట్‌…!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలలో కాంగ్రెస్‌దే పై చేయి.. స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలో కమ్యూనిస్టుల కోట అయిన ఉమ్మడి నల్గొండ జిల్లా గత రెండు మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలుస్తుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ హవాలో కాంగ్రెస్ అధిక స్థానాలు గెల్చుకోగలిగింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి, కాంగ్రెస్‌లో ఆర్థికంగా శక్తివంతమైన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇలా కాంగ్రెస్ అగ్ర నాయకులంతా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారే. ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్, జానారెడ్డి తదితర నాయకులకు తమ నియోజకవర్గాల్లో తిరుగులేదు.అయితే జిల్లాల పునర్విభజన తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా 3 జిల్లాలుగా విభజితమైంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తొలిసారిగా 5 స్థానాలు గెలిచింది. ఈ మూడున్నరేళ్లలో కూడా ఆ పార్టీ పెద్దగా పుంజుకోలేదు. పైగా మునుగోడు, సూర్యాపేట, తుంగతుర్తిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉందని వార్తలు వస్తున్నాయి..దీంతో కాంగ్రెస్ ఉమ్మడి నల్గొండ జిల్లా తమకు కంచుకోట అని ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఉంది. అయితే కాంగ్రెస్‌‌కు అనుకున్నంత బలం లేదని..తమ పార్టీ ఎమ్మెల్యేల పట్ల వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తాజాగా ఓ సర్వేలో బయటపడింది. దీంతో కాంగ్రెస్ నాయకులు కంగుతిన్నారు. నల్గొండ లోకసభ స్థానానికి ఉప ఎన్నికల రాబోతుందని గత కొద్ది రోజులుగా మీడియాలో ప్రచారం నడుస్తుంది. అక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డి మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరారు. అయితే తాను రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. గుత్తా రాజీనామా విషయం లోకసభ స్పీకర్ పరిధిలో ఉంది. అయితే సీఎం కేసీఆర్ రైతు సమన్వయ సమితులను కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువచ్చి గుత్తాను ఛైర్మన్ చేయాలని భావిస్తున్నారు. దీనికి తోడుగా నల్గొండ ఉప ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని నిలబెట్టి గులాబీ సత్తా చాటాలని కేసీఆర్ ఆలోచన. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఇంకా రెండేళ్లు కూడా లేకపోవడంతో నల్గొండ ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా టీఆర్ఎస్‌‌కు ప్రజలు సానుకూలంగా ఉన్నారని సంకేతాలు
పంపించినట్లవుతుందని కేసీఆర్ భావిస్తున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

నల్గొండ లోకసభా స్థానానికి ఉప ఎన్నికలు రాబోతున్నాయనే వార్తలతో టీ కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు..ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మాదే విజయం..నల్గొండ ఎన్నికల్లో హస్తం హవా ఏంటో చూపిస్తాం..కేసీఆర్ పాలనకు నల్గొండ ఉప ఎన్నికల ద్వారా పతనం ప్రారంభమవుతుందని టీ కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారు జబ్బలు చరుచుకున్నారు..నల్గొండ బ్రదర్స్‌ అయితే పోటీలో మేమే నిలబడతాం అని తొడ కొట్టారు. కానీ కేసీఆర్ మాత్రం నల్గొండ ఉప ఎన్నిక జరుతుందని కానీ, జరగదని కానీ క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఎందుకైనా మంచిదని టీ కాంగ్రెస్ నాయకులు నల్గొండ లోక సభా పరిధిలో తమ పార్టీ ఎంత బలంగా ఉందనే దానిపై రహస్యంగా సర్వే నిర్వహించింది. తీరా ఆ సర్వే రిజల్ట్స్ చూసి టీ కాంగ్రెస్ నాయకులు కంగుతిన్నారు. నిజానికి 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థిగా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి 4,93,849 ఓట్ల‌ తేడాతో గెలుపు బావుటా ఎగ‌రేశారు. కానీ, ఇప్పుడు ప్లేట్ తిర‌గ‌బ‌డిపోయింది. తాజా సర్వేలో కాంగ్రెస్‌కు ఆయా నియోజకవర్గాల్లో పూర్తిగా వ్యతిరేకత ఉన్నట్లు తేలింది. క్షేత్ర స్థాయిలో అధికార పార్టీపై తాము అనుకుంటున్నంత వ్యతిరేకత ఏమీ లేదని సర్వేలో వెల్లడైంది.. దీంతో టీ కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారు సైలెంట్ అయ్యారు. అయితే ఒక వేళ కొంపదీసి నల్గొండ ఎంపీ సీటుకు ఉప ఎన్నిక వస్తే..తాము టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి ముందుగానే కసరత్తులు చేయాలని పార్టీ నిర్ణయించింది. దీనికిగాను ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించేందుకు రెడీ అవుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ కంచుకోటగా నిలుస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరిస్థితి మారుతుంది. ఒక వేళ నల్గొండ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరిగి టీఆర్ఎస్‌ గెలిస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా గులాబీ కోటగా మారుతుందనడంలో సందేహం లేదు..మొత్తానికి
నల్గొండ ఎంపీ సీటుకు ఉప ఎన్నిక టీ కాంగ్రెస్‌కు ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా మారింది.మరి ఏం జరుగుతుందో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat