టీ – శాట్ ఛానెల్ వార్షికోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. టీ – శాట్ ఛానెల్ ఆవరణలో అన్నమయ్య సంకీర్తనల చిత్రీకరణను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు కీరవాణి మంత్రి కేటీఆర్కు జ్ఞాపికలు అందజేశారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ నలు మూలలా, పల్లెలు కావొచ్చు.. పట్టణాలు కావొచ్చు ముఖ్యంగా, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి యువకులు, యువతులు, ఉన్నత అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు బయటకు కోచింగ్ సెంటర్లకు పోయి వేలకు వేల రూపాయలు ఖర్చుపెట్టే అవసరం లేకుండా టీ – శాట్ ఛానెల్ విద్యా బోధన చేస్తుండటం సంతోషకరమైన విషయమన్నారు. ఈ ఛానెల్లో కార్యక్రమాలు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. టీ – శాట్ ఛానెల్ ఏర్పాటుకు కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.