ఈడీ చార్జిషీట్లో తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పేరు నమోదుచేసింది. సీబీఐ మాజీ డైరెక్టర్లు ఏపీ సింగ్, రంజిత్ సిన్హా అవినీతి కేసులో షబ్బీర్ అలీపేరు తెరపైకి వచ్చింది. రంజిత్ సిన్హా కోసం హవాలా డీలర్ మెయిన్ ఖురేషీ లంచాలు వసూలు చేశాడు. కాగా, ఖురేషికి షబ్బీర్ అలీ లంచం ఇచ్చి తన పనులు చేయించుకున్నాడని ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. అయితే దీనిపై స్పందించిన.. షబ్బీర్ అలీ, మీడియాతో మాట్లాడుతూ ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, తన పేరు అందులో లేకపోవచ్చునని అన్నారు. ఏసీబీ, ఈడీ ఎవరు పిలిచినా తప్పకుండా వెళతానని, వారికి కోపరేట్ చేస్తానని అన్నారు. తనకు నోటీసు అయితే ఇప్పటివరకు రాలేదని, ఒక వేళ వస్తే ఆ కాపీ తప్పకుండా మీడియాకు అందజేస్తానని ఆయన చెప్పారు. తనకు నోటీసు రానిదే ఏమీ మాట్లాడలేనని షబ్బీర్ ఆలీ పేర్కొన్నారు.
Post Views: 395