తెలంగాణ ఆర్టీసీకి చెందిన సిబ్బంది ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఉన్నారు.. కానీ యూనియన్ల సంఘాల నాయకులు మాత్రమే వారిని రెచ్చకొడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఒక ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయి. తండ్రి పాత్రలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పిల్లలు అయిన ఆర్టీసీ సిబ్బందిని పిలిపించుకుని మాట్లాడాతారు అని చెప్పారు. పిల్లలు అన్నప్పుడు అలుగుతారు. వారిని తండ్రి సముదాయిస్తాడు. బుజ్జగిస్తారు. ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఇరవై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
