తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పలు శాఖాల్లో ఉన్న ఖాళీలను విభిన్న నోటిఫికేషన్లతో భర్తీ చేస్తున్న సంగతి విదితమే. తాజాగా రాష్ట్రంలో టీఎస్ఎస్పీడీసీఎల్ ఐదు వందల అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు రేపటి నుంచి అంటే గురువారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నది. అర్హతల గురించి పూర్తి వివరాలతో పాటుగా ఫీజులు చెల్లింపు తదితర అంశాల గురించి దీనికి సంబంధించిన tssouthernpower.cgg.gov.in లో తెలుసుకోవచ్చు. అయితే ఫీజులు చెల్లింపు ఈ రోజు నుంచే చేసుకోవచ్చు. కానీ దరఖాస్తులు మాత్రం రేపటి నుండి నవంబర్ 20వ తారీఖు వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు. వయస్సు 18-34ఏళ్ళ లోపు ఉన్న అభ్యర్థులు అర్హులు.
