తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా రెండోసారి అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి బాధ్యతల స్వీకరించిన కార్యక్రమంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్పోర్ట్స్ చైర్మన్ నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొని వెంకటేశ్వర రెడ్డి ని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు క్రీడా తెలంగాణ గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు.
దేశంలో తెలంగాణ క్రీడాకారులు ఎంతో ప్రతిభ కనబరుస్తూ రాష్ట్రానికి ఎంతో గౌరవం తీసుకువస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు క్రీడాకారులకు విద్యా, ఉద్యోగాలలో మంచి ప్రోత్సాహము అందిస్తున్నారని మంత్రి తెలిపారు. స్పోర్ట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి ని రెండోసారి ఛైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
స్పోర్ట్స్ ఛైర్మన్ గా రెండోసారి తనపై నమ్మకంతో బాధ్యత లను అప్పగించిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి, రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఎండీ దినకర్ బాబు, క్రీడాకారులు పాల్గొన్నారు.