Home / SPORTS / పోర్న్ స్టార్ కేసులో అడ్డంగా ఇరుక్కున్న ప్ర‌ముఖ క్రికెట‌ర్‌..!

పోర్న్ స్టార్ కేసులో అడ్డంగా ఇరుక్కున్న ప్ర‌ముఖ క్రికెట‌ర్‌..!

క్రికెట్ అంటే జెంటిల్ మెన్ గేమ్‌.. క్రికెట‌ర్లు గ్రౌండ్ లోనూ బ‌య‌ట ప్ర‌పంచంలోనూ హుందాగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. అయితే ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ మాత్రం త‌ర‌చూ శృంగార వార్త‌ల‌తో హాట్ టాపిక్‌గా మారుతున్నాడు. ఎంజాయిమెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన వార్న్ తాగి ఆనంద పడి ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. లండన్ లోని ఒక నైట్ క్లబ్ లో వలేరి ఫాక్స్ అనే పోర్న్ స్టార్ తో గొడవపడి ఆమెను చితక్కొట్టాడు. ఈ విషయం ఆమె తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడమే కాదు లండన్ వెస్ట్ మినిస్ట్రీ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. ఈ కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

 

పోర్న్ స్టార్ పెట్టిన కేసులో ప్రత్యక్ష సాక్షులు కూడా ఉండటం తో స్పిన్ మాంత్రికుడికి అరదండాలు పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత పదేళ్లుగా వార్న్ లండన్ లోనే ఉంటున్నాడు. నిత్యం క్లబ్బుల్లో తాగి తందనాలు ఆడటం ఎవరో ఒకరితో గొడవపడటం అతడికి రివాజే . ఇప్పుడు కూడా అదే జరిగింది. ఈ కేసు బలంగా మారడంతో వార్న్ చిక్కుల్లో పడ్డట్టే. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం షేన్ వార్న్ కి కొత్తేమి కాదు . గతంలో కూడా అనేక సార్లు ఇలాంటి వివాదాలే నడిచాయి వార్న్ మీద . వాటి నుంచి ఎలాగో అలా బయటపడిన ఈ స్పిన్ దిగ్గజం తన జీవితంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు మాత్రం నేర్చుకోవడం లేదు. అమ్మాయిలకు అసభ్య మెసేజ్ లు , డ్రగ్స్ కేసులు ఇలా ఒకటేమిటి వార్న్ జీవితం అంతా గందరగోళమే. వెటరన్ క్రికెటర్ గా హుందాగా నడుచుకోవాలిసిన వార్న్ చిల్లర గొడవల్లో తరచూ దూరిపోవడం సర్వసాధారణం. ఇప్పటికే వార్న్ పై లండన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రెండు పెండింగ్ లో ఉండటం గమనార్హం .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat