Home / SPORTS / మంచుకొండల్లో కోహ్లి పక్కన ఉంటే ‘ స్వర్గంలో ఉన్నట్లుంది’

మంచుకొండల్లో కోహ్లి పక్కన ఉంటే ‘ స్వర్గంలో ఉన్నట్లుంది’

అతి రహస్యంగా ఇటలీలో ఇటీవల పెళ్లిచేసుకున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ హనీమూన్‌లో బిజీబిజీగా ఉన్నారు. తమ హనీమూన్‌ ఫోటోను అనుష్క, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఫోటో షేర్‌చేసిన గంటల్లోనే ఏడున్నర లక్షలకు పైగా లైక్స్‌ను సొంతం చేసుకుంది. కామెంట్ల వెల్లువ కురుస్తోంది. అయితే ఈ కొత్త జంట సౌత్‌ఆఫ్రికాలోని ఒక చిన్నదీవిలో వీరు హనీమూన్‌ను ఎంజాయ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా అనుష్క షేర్‌ చేసిన ఈ ఫోటో హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా మరో రెండు ఫొటోలు వెలుగులోకి వచ్చాయి.

మంచుకొండల్లో విరాట్ కోహ్లి పక్కన ఉంటే ‘ స్వర్గంలో ఉన్నట్లుంది’ అంటూ అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో కాప్షన్ రాసిన విషయం తెలిసిందే. ఈ నూతన జంట.. రాజకీయ ప్రముఖులకి డిసెంబరు 21న గ్రాండ్‌గా ఢిల్లీలో వివాహ విందు ఇవ్వనుంది. అనంతరం భారత క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులకి డిసెంబరు 26న ముంబయిలో ప్రత్యేక రిషప్షన్‌ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటన కోసం మళ్లీ విరాట్ కోహ్లి భారత జట్టుతో చేరనున్నాడు.