వచ్చే నెల మార్చ్ 10న( మిలియన్ మార్చ్ నిర్వహించిన రోజున )తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ వరంగల్ నగరంలో తన కొత్త పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్టు చెప్పిన విషయం తెలిసిందే.అయితే ఆదివారం టీజేఏసీ కోర్‌కమిటీ మీటింగ్ జరిగింది.ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ… పార్టీ ఏర్పాటుచేసే పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాజకీయ వేదిక కోరుతున్నారని చెప్పారు. ఇదే సమయంలో జేఏసీ కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతు సమస్యలు, నిరుద్యోగం, ఉపాధి కల్పన, భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారమే పార్టీ ఎజెండా అని స్పష్టం చేశారు.కాగా కొత్తగా ఏర్పాటుచేయనున్నపార్టీ కి తెలంగాణ జనసమితి పార్టీ.. గుర్తుగా రైతు, నాగలిని నిర్ణయించినట్లు టీజేఏసీ చైర్మన్ కోదండరాం వెల్లడించారు.
see also : వైసీపీలోకి టీడీపీ ఎంపీ ..జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ ..వైసీపీ ఎమ్మెల్యే..