తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ రాష్ట్ర రాజాధాని హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్ లో జరిగిన టిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారు . టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్, పార్టీ నేతలు బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్ ముదిరాజ్ లను ఎంపిక చేసినట్టు తెలిపారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ యాదవులకు గతంలోనే హామీ ఇచ్చారు.ఇచ్చిన మాటను సీ ఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు.
బడుగుల లింగయ్య యాదవ్ బయోడేటా..
పూర్తి పేరు : బడుగుల లింగయ్య యాదవ్.
తల్లిదండ్రులు : అంతయ్య, యలమంచమ్మ.
ఊరు: భీమారాం, కేతేపల్లి మండలం, నల్లగొండ జిల్లా.
వయస్సు : 58సంవత్సరాలు.
చదువు : బిఎ, బీఈడీ.
భార్య : నాగమణి,
పిల్లలు : కొడుకు డాక్టర్ యస్వంత్, కూతురు దీప్తి.
రాజకీయ ప్రవేశం : 1982లో టీడీపీలో కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభం.
- 1985-87లో కేతేపల్లి మండల తెలుగు యువత అధ్యక్షుడు, 1987-97మధ్యలో కేతేపల్లి మండల టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు,
- 1995లో భీమారాం నుంచి ఎంపీటీసీ సభ్యునిగా గెలుపు, 1998-2012 మధ్యలో టీడీపీ నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా సుధీర్ఘ కాలం పనిచేశారు.
- 2009లో మహాకూటమి తరుపున స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పోటీ చేసి 26ఓట్లతో నేతి విద్యాసాగర్ చేతిలో ఓడిపోయారు.
- 2012-2015 మార్చి వరకు టీడీపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తూ పార్టీకి రాజీనామా చేశారు.
2015 మార్చి 16వ తేదీన సీఎం కేసిఆర్ సమక్షంలో టీఆరెస్ లో చేరిక.
ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు.