తెలుగు రాష్ర్టాల చరిత్రలో జనవరి 1, 2019కి ప్రత్యేకత చేరింది. నిజాంరాజు 1919లో ఏర్పాటుచేసిన హైకోర్టు.. వందేండ్లు పూర్తయిన తర్వాత తెలంగాణ, ఆంధప్రదేశ్ హైకోర్టులుగా విడిపోయింది. 1915 ఏప్రిల్ 15న ప్రారంభమైన దీని నిర్మాణం.. 1919 మార్చి 31న పూర్తయింది. 1920 ఏప్రిల్ 20నాడు అప్పటి ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దీనిని ప్రారంభించారు. అప్పట్లో దానిని నిజాం రాజ్యం హైకోర్టుగా పిలిచేవారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలన అంతమైన తర్వాత ఇది హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్‌గా రూపాంతరం చెందింది.
అనంతరం రాష్ట్రాల పునర్విభజన చట్టం 1956 ప్రకారం ఉమ్మడి ఆంధప్రదేశ్‌కు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా మారింది. 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత హైకోర్ట్ ఆఫ్ జ్యూడికేచర్ ఎట్ హైదారాబాద్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ, అండ్ ది స్టేట్ ఆఫ్ ఆంధప్రదేశ్‌గా మారింది. 2019 జనవరి ఒకటి నుంచి తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేకంగా హైకోర్టులు ఏర్పడటంతో ప్రస్తుత ఉమ్మడి హైకోర్టు భవనం హైకోర్ట్ ఆఫ్ తెలంగాణగా మారింది. ఎన్నో ఏండ్ల పోరాటం తర్వాత నిజాం నిర్మించిన హైకోర్టు భవనం మళ్లీ తెలంగాణ హైకోర్టుగా మారడం విశేషం. అదికూడా సరిగ్గా వందేండ్ల క్రితం తెలంగాణలో అద్భుతంగా నిర్మించిన భవనంలో ఏర్పడిన హైకోర్టు.. పలుమార్లు పేర్లు మార్చుకుని.. ఇప్పుడు తెలంగాణ హైకోర్టుగా అదే భవనంలో పురుడుపోసుకోవడం గమనార్హం.
Post Views: 346