Home / 18+ / మొన్న జరిగిన మారణహోమం మరవక ముందే శ్రీలంకలో మరో పేలుడు..

మొన్న జరిగిన మారణహోమం మరవక ముందే శ్రీలంకలో మరో పేలుడు..

గత ఆదివారం ఈస్టర్‌ సందర్భంగా జరిగిన దుర్ఘటన మర్చిపోకముందే శ్రీలంకలో శుక్రవారం మరోసారి కుల్మునాయి ప్రాంతంలో మూడు చోట్ల బాంబులు పేల్చారు.పేలుళ్లతో అలెర్ట్ ఐన సైన్యం ఆ ప్రాంతంలోని ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించింది.సైన్యం రాకను పసిగట్టిన దుండగులు కాల్పులు ప్రారంభించారు.ఇరువర్గాల మధ్య కాసేపు కాల్పులు జరిగాయి.ఈ క్రమంలో ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు తమని తాము పేల్చుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ క్రమంలో పెద్దఎత్తున పేలుడు పదార్ధాలు,డ్రోన్లు,జెండాలను స్వాదినం చేసుకున్నారు.అయితే ఈ ఉగ్రవాదులు నేషనల్‌ తౌవీద్‌ జమాత్‌కు చెందిన ముష్కరులుగా అనుమానిస్తున్నారు.ఇప్పటికే శ్రీలంకలోని పలు ప్రాంతాలలో కర్ఫ్యూ విధించారు.తాజాగా పేలుళ్లలో లంక ప్రజలు మరోసారి ఉలిక్కిపడ్డారు.ఈస్టర్‌ నుండి ఇప్పటివరకూ వరుస పేలుళ్లతో వందల మంది చనిపోయారు.