Home / TELANGANA / కేసీఆర్ పాలనలో 119 గురుకుల పాఠశాలలు..!!

కేసీఆర్ పాలనలో 119 గురుకుల పాఠశాలలు..!!

గత 70 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో 18 గురుకుల పాఠశాలలు మంజూరైతే.. కేసీఆర్ 5ఏళ్ళ పాలనలో 119 గురుకుల పాఠశాలలు మంజూరు అయ్యాయి అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 280 గురుకుల పాఠశాలలు మంజురు అయ్యయి. ప్రతి ఒక్క విద్యార్థికి 1లక్ష 20వేలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అని చెప్పారు. సోమవారం జనగాం జిల్లాలో పర్యటించిన మంత్రి.. మీడియా సమావేశంలో మాట్లాడారు. వచ్చే నెలలో రైతులకు లక్ష రుపాయల రుణ మాఫీ, వృద్దులకు,వితంతువులకు 2016, వికలాంగులకు 3016 పెన్షనులు ఇవ్వబోతున్నాము అన్నారు