Home / POLITICS / రాష్ట్రంలో జోరుగా వర్షాలు..కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదారమ్మ నీటితో కలకల

రాష్ట్రంలో జోరుగా వర్షాలు..కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదారమ్మ నీటితో కలకల

తెలంగాణ రాష్ట్ర వర్షాలు జోరుగా కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ వరప్రధాయని కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదారమ్మ నీటితో కలకల లాడుతుంది. గోదావరిలో కలుస్తున్న ప్రాణహిత వరదనీటి ప్రవాహాంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపురేఖలు మారిపోయాయి. నీటి ప్రవాహంతో గోదావరి నీరు ఉరకలెత్తుతోంది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మెడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లు మొత్తం మూసివేశారు.గేట్లు మూసివేయడంతో అక్కడ నీటి మట్టం 94 మీటర్లకు చేరుకుంది. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద 96 మీటర్ల వరకు నీరు నిలవడంతో 6వ పంపు ,3వ పంపుతో నీరు ఎత్తి పోస్తున్నారు. ఈ నీరు గ్రావిటీ కెనాల్ ద్వారా 13.5 కిమి ప్రయాణించి అన్నారం బ్యారేజ్‌లోకి చేరుకుంటున్నాయి.