Breaking News
Home / SPORTS / మాంచెస్టర్ టెస్టులో గెలిచేదెవరూ..?

మాంచెస్టర్ టెస్టులో గెలిచేదెవరూ..?

యాషెస్ సిరీస్  లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదట టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ పుణ్యమంటూ భారీ స్కోర్ సాధించింది. అనంతరం వచ్చిన ఇంగ్లాండ్ 301 పరుగులకు ఆల్లౌట్ అయ్యింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఐన వారికి ఏమాత్రం భయం లేదు ఎందుకంటే గ్రీజ్ లో ఇంకా స్మిత్ ఉన్నాడు. అనుకున్నట్టుగానే స్మిత్ తన అధ్బుతమైన ఆటతో స్కోర్ ని ముందుకు నడిపించాడు. మొత్తానికి ఇంగ్లాండ్ ముందు 383 పరుగుల లక్ష్యాన్ని పెట్టారు. చేసింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 18 పరుగులకే 2వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈరోజే ఆఖరి రోజు కావడంతో మరి విజయం ఎవరిని వరిస్తుంది అనేది ప్రశ్నగా మారింది.