యాషెస్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న నాలుగవ టెస్ట్ లో అనుకున్నట్టుగానే ఆస్ట్రేలియా గెలిచేసింది. ఏ కోణంలో ఇంగ్లాండ్ ఆ జట్టు ముందు నిల్వలేకపోతుంది. 383 పరుగుల భారీ లక్ష్యంతో భరిలోకి దిగిన ఇంగ్లాండ్ 197 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది. పాట్ కమ్మిన్స్ అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లీష్ ఆటగాలకు చుక్కలు చూపించాడు. ఇక ఈ విజయం లో కీలక పాత్ర ఎవరిదీ అనే విషయానికి వస్తే..ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ అనే చెప్పాలి. మొదటి ఇన్నింగ్స్ లో 211 పరుగులు సాధించిన స్మిత్, రెండో ఇన్నింగ్స్ లో 82 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం 2-1తో ఆస్ట్రేలియా సిరీస్ లో ముందంజులో ఉంది.
