Home / CRIME / టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను చంచల్‌గూడ జైలుకు తరలింపు

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను చంచల్‌గూడ జైలుకు తరలింపు

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కంపెనీని కొత్త యజమాన్యం కొనుగోలు చేసిన తర్వాత అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్.. మరో డైరెక్టర్ ఎంకేవీఎస్ మూర్తితో కలిసి కుట్రకు పాల్పడి అక్రమ మార్గంలో రూ.18 కోట్లను సొంతానికి వాడుకొన్నట్టు ప్రస్తుత టీవీ9 సీవోవో గొట్టిపాటి సింగరావు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన బంజారాహిల్స్ పోలీసులు శనివారం రవిప్రకాశ్‌ను అరెస్టు చేశారు. బాధితులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్ కళింగరావు నేతృత్వంలోని దర్యాప్తు బృందం ప్రధాన నిందితుడైన రవిప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్నది. శనివారం సాయంత్రం 7 గంటలకు రవిప్రకాశ్‌ను అరెస్టు చేసినట్టు హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ సుమతి తెలిపారు గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షల అనంతరం రవిప్రకాశ్‌ను చిలకలగూడలోని జడ్జి నివాసంలో హాజరుపర్చగా.. 18వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దీంతో రవిప్రకాశ్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat