Home / ANDHRAPRADESH / హైదరాబాద్‌లో జలవిహార్‌‌ను సందర్శించిన శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి..!

హైదరాబాద్‌లో జలవిహార్‌‌ను సందర్శించిన శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి..!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి మలివిడత హిందూ ధర్మ ప్రచారయాత్ర.. హైదరాబాద్ నగరంలో దిగ్విజయవంతంగా సాగుతోంది. గత ఆరు రోజులుగా జూబ్లిహిల్స్‌లోని జలవిహార్ రామరాజు నివాసంలో శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు నిర్వహిస్తున్న స్వామివారు పూజల అనంతరం భక్తుల ఆహ్వానం మేరకు వారి ఇండ్లలో జరిగే పాదపూజల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో నవంబర్ 7న నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌ను శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి సందర్శించారు. జలవిహార్ యాజమాన్యం, సిబ్బంది స్వామివారి పాదాలకు పూలు సమర్పిస్తూ.. ఘన స్వాగతం పలికారు. జలవిహార్ కార్యాలయంలో సిబ్బందితో పాటు, భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్ర తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.