Home / TELANGANA / మెట్రో జ‌ర్నీలో స‌మ‌స్య‌లున్నాయా…ఇలా ప‌రిష్క‌రించుకోండి..!!

మెట్రో జ‌ర్నీలో స‌మ‌స్య‌లున్నాయా…ఇలా ప‌రిష్క‌రించుకోండి..!!

సాధార‌ణంగా ఉండే ర‌ద్దీకి తోడు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో రైళ్లలో రద్దీ బాగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా మెట్రో సర్వీసుల సంఖ్య, ఫ్రీక్వెన్సీ పెంచి.. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తోంది. మహిళలకు, వృద్ధులకు ప్రత్యేక కోచ్‌లు పెట్టి సౌకర్యంగా ప్రయాణించేలా వారికి సాయపడుతోంది. రోజు లక్ష మంది పైగా ప్రయాణికులను సర్వీస్ అందిస్తోంది. దీంతో పాటుగా సేవ‌ల‌ను మెరుగుప‌ర్చుకునేందుకు కృషి చేస్తోంది.

ఇది వరకే మెట్రో ట్రైన్‌లో లేడీస్ కోచ్‌లోకి మగవాళ్లు వచ్చినా, వ‌ృద్ధుల సీట్లలో ఇతరులు కూర్చున్నా ఫిర్యాదు చేసేందుకు వాట్సాప్ కంట్టైంట్ నంబరు(+91 7032224242)ను ఇచ్చింది. 79959 99533 నంబరు ద్వారా వాట్సాప్‌లో మెట్రోను పలికరించొచ్చు. ప్రయాణికులు మెట్రో సర్వీసులపై తమ ఫీడ్‌బ్యాక్‌ను తెలియజేయవచ్చు. అలాగే సేవలను ఎలా మెరుగుపరుచుకోవచ్చన్న దానిపై సలహాలు కూడా ఇవ్వవచ్చు. సమస్యలపై ఫిర్యాదులు కూడా చేయొచ్చు.

ఇలా ఫిర్యాదు చేయ‌వ‌చ్చు

– 79959 99533 నంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకుని వాట్సాప్‌లో ట్రైన్ నంబర్.XX అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి.. మీ మెసేజ్‌ టైప్ చేసి పంపాలి.
– ఉదాహరణకు మీరు ప్రయాణిస్తున్న టైన్ నంబర్ 15 అయితే.. ట్రైన్ నెం.15 ట్రైన్ సమయ పాలన బాగుంది లేదా ట్రైన్‌లో మరేదైనా సమస్యను కూడా ప్రస్తావించవచ్చు.
– అలాగే స్టేషన్, ప్లాట్ ఫాం, సెక్యూరిటీ సహా ఇతర కంప్లైంట్స్‌ను ఏ ఫార్మాట్ తో పని లేకుండా నేరుగా వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చు.