Home / INTERNATIONAL / ఇలాంటి భర్తను ఎక్కడా చూడలేదు..నటి సంచలన వ్యాఖ్యలు

ఇలాంటి భర్తను ఎక్కడా చూడలేదు..నటి సంచలన వ్యాఖ్యలు

తనను, తన 17 నెలల పాపను ఒక అవార్డ్స్ ఫంక్షన్ కి తీసుకెళ్లి..అటు నుంచి అటే వదిలేసి ఎస్కెప్ అయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది అమెరికన్ నటి ప్రిన్సెస్ లవ్. వివరాల్లోకెళితే..35 ఏళ్ల ప్రిన్సెస్‌ సింగర్ రేజేను పెళ్లి చేసుకుంది. వీరికి 17 నెలల కూతురు ఉంది. ప్రస్తుతం ప్రిన్సెస్ ఎనిమిది నెలల గర్భిణి. అయితే నవంబర్ 17న లాస్ వెగాస్‌లో జరిగిన బెట్ సౌల్ ట్రెయిన్ అవార్డ్స్ వేడుకకు ప్రిన్సెస్‌‌ని కూతురిని తీసుకుని వెళ్లాడు రేజే. షో అయిపోయాక రేజే భార్యాపిల్లల్ని వదిలేసి వెళ్లిపోయాడట! దాంతో ప్రిన్సెస్ తన కూతురితో లాస్ వెగాస్‌లోనే ఉండిపోయింది. ఇంతటి నీచమైన భర్తను నేనెక్కడా చూడలేదంటూ ఈ విషయాన్ని ప్రిన్సెస్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.

8 నెలల గర్భిణి అని కూడా చూడకుండా నన్ను నా కూతురును నా భర్త వదిలేసి వెళ్ళాడు. ఫోన్ చేస్తే..నంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు. ఇంతటి మోసగాడికి నేను గుడ్ బాయ్ చెప్పాలనుకుంటున్నా. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను నా పాపను తీసుకొని ఇంటికి వెళ్ళగలను, కానీ 8 నెలలు నిండటంతో కారు డ్రైవింగ్ చెయ్యలేను, ఈ సమయంలో డ్రైవ్ చేస్తే పురిటి నొప్పులు వస్తాయి కాబట్టి..డ్రైవర్ ను పెట్టుకొని ఇంటికి చేరుకున్నట్టు చెప్పింది నటి ప్రిన్సెస్ లవ్.