Home / TELANGANA / మా పన్నుల వాటా ఏది..కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ లేఖ

మా పన్నుల వాటా ఏది..కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ లేఖ

పార్లమెంటులోనూ, బయటా దేశంపై ఆర్థిక మాంద్యం ప్రభావం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రతీ రోజూ గొప్పలు చెప్పుకుంటున్నది. కానీ, వాస్తవాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి – కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు శనివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు  రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి   సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి   రామకృష్ణ రావు, సిఎంఓ ముఖ్య కార్యదర్శి   ఎస్. నర్సింగ్ రావు, ప్రత్యేక కార్యదర్శి  భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో వాస్తవ ఆర్థిక పరిస్థితులు కుండ బద్ధలు కొట్టినట్లుగా బయటపడ్డాయి.

దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర పన్నుల్లో వాటాను కేంద్రం నిర్ణయించి, బడ్జెట్ ద్వారా ప్రకటిస్తుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా ద్వారా 19,719 కోట్ల రూపాయలను అందివ్వనున్నట్లు కేంద్రం తన బడ్జెట్లో పేర్కొన్నది. ఇది గత ఆర్థిక సంవత్సరమైన 2018-19లో కేటాయించిన రూ.18,560 కోట్ల కన్నా 6.2 శాతం అధికం. అయితే, గడిచిన ఎనిమిది నెలల్లో రాష్ట్రానికి అందిన కేంద్ర పన్నుల వాటా రూ.10,304 కోట్ల రూపాయలు మాత్రమే. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే ఎనిమిది నెలల కాలానికి రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన పన్నుల వాటా రూ.10,528 కోట్లు. అంటే నికరంగా చూస్తే 2018-19 ఆర్థిక సంవత్సరం కన్నా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 224 కోట్ల రూపాయలు తక్కువగా వచ్చింది. అంటే కేంద్ర బడ్జెట్లో సూచించిన లెక్కల ప్రకారం వాస్తవానికి 6.2 శాతం అధికంగా రావడం అటుంచి, 2.13 శాతం తగ్గింది. అంటే గత ఆర్థిక సంవత్సరం కంటే 700 కోట్లు అధికంగా రావాల్సిన నిధులు రాకపోగా, మరో 224 కోట్ల రూపాయలు తగ్గిపోవడంతో మొత్తంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పన్నుల వాటా రూ.924 కోట్లు తగ్గింది.

ఇదే విషయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణ రావు ఇటీవల ఢిల్లీకి వెళ్లి తమకు కేంద్ర పన్నుల వాటాలో 8.3 శాతం తక్కువ వచ్చిందని కేంద్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి తెచ్చారు. దీనివల్ల రాష్ట్రంలో అనేక పథకాలు ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి వచ్చిందని వివరించారు. దానికి ప్రతిస్పందనగా కేంద్ర ప్రభుత్వ అధికారులు పరిస్థితులు నిరాశాజనకంగా ఉన్నాయని, 8.3 శాతమే కాకుండా, ఇది మరింత తగ్గి 15 శాతానికి చేరుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని వెల్లడించారు.

గడిచిన ఎనిమిది మాసాలకు కేంద్ర పన్నుల వాటాలో 8.3 శాతం తగ్గిందని రాష్ట్ర అధికారులు మొర పెట్టుకుంటే, అది 15 శాతానికి తగ్గుతుందని కేంద్ర అధికారులు చెప్పారు. 15 శాతం తగ్గుదల అంటే మొత్తం ఏడాదికి కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.2,957 కోట్లు తగ్గుతాయి.

పార్లమెంటులో మంత్రులు చెబుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదు. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ పరిస్థితి ఇట్లనే కొనసాగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్నవస్త్రం కోసం పోతే ఉన్నవస్త్రం పోయిందన్నట్లు పరిస్థితి తయారయింది. ఆర్థిక పరిస్థితి అనిశ్చితి స్థితిలోఉంది.

కేంద్ర పన్నుల వాటా గణనీయంగా తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని శాఖలకు సమాంతరంగా నిధులు తగ్గించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఏదో ఒక శాఖలో కాకుండా అన్ని శాఖల్లో ఖర్చులు తగ్గించడానికి తగు రీతిలో చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖకు సిఎం సూచించారు.

కేంద్ర మంత్రికి సీఎం లేఖ
—————————
కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటాను విడుదల చేయాలని, లేనట్లయితే వాస్తవాలను వెల్లడించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శనివారం లేఖ రాశారు.

కేంద్ర ప్రభుత్వానిది లోపభూయిష్ట విధానం
————————————————
ఏది ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ట విధానం వల్లనే ఈ సంకట పరిస్థితి దాపురించిందని సమీక్షా సమావేశంలో తేలింది. రాష్ట్రంలో పరిస్థితి మరింత దిగజారకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ పాటించడం తప్ప మరో గత్యంతరం లేదని సమావేశం అభిప్రాయపడింది. అన్ని శాఖలను అప్రమత్తం చేసి, అన్ని శాఖల్లో ఖర్చులకు కోత విధించుకోవాలని, కఠినమైన నియంత్రణ పాటించాలని సిఎం ఈ సందర్భంగా సూచించారు.

ఐజిఎస్టీ నిధులకు కేంద్రం ఎగనామం
——————————————
ఇదిలా ఉండగా, 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిఎస్టీలో అంతర్భాగంగా ఉండే ఐజిఎస్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ.2,812 కోట్లకు కూడా కేంద్రం ఎగనామం పెట్టింది. తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఐజిఎస్టీ నిధులను కేంద్రం ఎగబెట్టిందనే విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. రావాల్సిన జిఎస్టీ నష్ట పరిహారం రూ.1,719 కోట్లు ఇది కాకుండా, 14 శాతం కంటే జిఎస్టీ ద్వారా తక్కువ రాబడి వచ్చిన రాష్ట్రాలకు నష్టం తామే పూడుస్తామని జిఎస్టీ చట్టం అమలు చేస్తున్న సందర్భంగా కేంద్రం అన్ని రాష్ట్రాలకు చట్టం ద్వారా హామీ ఇచ్చింది. అయితే దేశ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి 14 శాతం మేర జిఎస్టీ నిధులు సమకూరడం లేదు. దరిమిలా కేంద్రం నుంచి జిఎస్టీ నష్ట పరిహారం కింద రాష్ట్రానికి రూ.1,719 కోట్ల బకాయిలు అందవలసి ఉన్నది. ఈ డబ్బులు కూడా వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో సీఎం కేసీఆర్ కోరారు.

ప్రధానిని కలిసే ఆలోచనలో ముఖ్యమంత్రి
———————————————–
కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు రాకపోతే తమకు ఇబ్బందులు తలెత్తుతాయనే విషయాన్ని ఢిల్లీకి వెళ్లి ప్రధానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఐదారు రోజుల తర్వాత అధికారులను వెంటబెట్టుకుని వెళ్లి, పరిస్థితి తీవ్రతను వివరించి నిధులు అడగాలని భావిస్తున్నారు.

కేబినెట్ లో సమగ్ర వివరాలతో నోట్
—————————————–
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు – రాష్ట్ర ఆర్థిక పరిస్థితి- ఇతర ఆర్థిక అంశాలపై ఈనెల 11న జరిగే కేబినెట్ సమావేశంలో మంత్రులు, అధికారులకు సమగ్రమైన నోట్ అందించాలని ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి తగినట్లుగా రాష్ట్రంలో ఆర్థిక నియంత్రణ పాటించాలని, తగు ఆర్థిక క్రమ శిక్షణ పాటించాలని మంత్రులు, అధికారులను సిఎం కోరారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat